హైదరాబాద్, జేఎస్ డి ఎం న్యూస్:
ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్‌కు సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో విజయవంతంగా భుజం శస్త్రచికిత్స పూర్తయింది. ఇటీవల ఆయన భుజానికి గాయం కావడంతో, వైద్య నిపుణుల బృందం సలహా మేరకు వేగంగా కోలుకోవడానికి ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు మరియు డాక్టర్ శ్రీనివాసరావు సూరపనేనిలతో కూడిన వైద్యుల బృందం ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన త్వరలోనే ప్రత్యేక పునరావాస (రిహాబిలిటేషన్) ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాబోయే 2 నుంచి 3 నెలల వ్యవధిలో ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి వస్తారని కిమ్స్ ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.
