తాళ్లూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన ఆరు మెటల్ రోడ్లను ఉపాధి హామీ పనులలో రూ. 1.80 కోట్లతో చేపట్టారు. అయితే ఆ పనులు గత రెండేళ్ల క్రితం చేపట్టిన పనులను మరలా మంజూరు చేయించి బిల్లులు పొంది నిధులు దుర్వినియోగం చేసారని అ గ్రామానికి చెందిన పాలెపోగు మార్కు, అనంత సూర్య ప్రకాశ రావు లు రాష్ట్ర పంచాయితీ కమీషనర్‌కు ఫిర్యాదు చేసారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆ పనులపై విచారణ చేపట్టాలని డీఎల్పీఓ ఉమాదేవిని నియమించారు. ఆమె స్వర్ణ గ్రామ కార్యాలయంలో ఫిర్యాదు దారులను పిలిచి విచారించారు. గత పదేళ్లుగా గ్రామంలో చేసిన పనులకు అప్ గ్రేడియేషన్ చేస్తూ డబ్యు బి ఎమ్ మెటల్ రోడ్లు మంజూరు చేయగా ఆమేరకు పనులు చేయటం జరిగిందని పంచాయితీ రాజ్ డీఈ మాధవ రెడ్డి ఆమెకు వివరించారు. సంబంధిత ఎం బుక్‌లు, రికార్డులను చూపించారు. గతంలో పనిచేసిన ఎఈ ఇక్కడే 15 సంవత్సరాలు పనిచేసి అనేక అక్రమాలకు పాల్పడి చేసిన పనులలకే బిల్లు చెల్లించాలని పలు వివరాలను ఫిర్యాదు దారులు డీఎల్ పీఓ విన్నవించారు. తదుపరి ఆమె ఎం ఎన్ ఆర్ ఈజీ ఎన్లో చేపట్టిన ఆరు పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలను, రికార్డుల మేర పనులు జరిగాయా లేవా అన్న విషయాలను పరిశీలించారు. నూతన రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. అనేక పర్యాయములు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని తమకు రాష్ట్ర స్థాయి కమిటతో విచారణ చేయించి తగు న్యాయం చెయ్యాలని ఫిర్యాదు దారులు విన్నవించారు. విచారణలో వెల్లడైన అంశాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులను నివేదిస్తామని చెప్పారు. ఇన్చార్జి ఎంపీడీఓ వి శ్రీనివాస రావు, డీఈ మాధవ రెడ్డి, ఎఈ వెంకటేశ్వర్లు, పంచాయితీ కార్యదర్శి స్వర్ణ లత తదితరులు పాల్గొన్నారు.
