ఆగస్టు 14న ట్యాంక్‌బండ్ వద్ద ‘తిరంగా ర్యాలీ.ట్రాఫిక్ మళ్లింపులపై హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ప్రకటన.

హైదరాబాద్ ఆగస్ట్ 13,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ట్యాంక్‌ బండ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుండి చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని M-47 ప్యాటన్ ట్యాంక్ వరకు నిర్వహిస్తున్న “తిరంగా ర్యాలీ” (Tiranga Rally) సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక మళ్లింపులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు అవసరమైన మేరకు (Need basis) ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు.gbc
కర్బాలా మైదాన్ వైపు నుండి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే సాధారణ వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్‌పైకి అనుమతించరు. ఈ వాహనాలను సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ వైపు మళ్లిస్తారు.డిబిఆర్ మిల్స్ వైపు నుండి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే సాధారణ వాహనాలను అనుమతించరు. వీటిని డిబిఆర్ మిల్స్ వద్ద గోశాల – కవాడిగూడ వైపు మళ్లిస్తారు.ట్రాఫిక్ రద్దీ ఏర్పడే జంక్షన్లు
ఆగస్టు 14న మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపుల వల్ల క్రింది జంక్షన్లలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులు ఈ ప్రాంతాలను నివారించాలని పోలీసులు సూచించారు.సెయిలింగ్ క్లబ్ ,డిబిఆర్ మిల్స్ వైపు రావద్దన్నారు.
ప్రయాణికులకు విజ్ఞప్తి
ర్యాలీ పూర్తయిన వెంటనే రహదారులపై ఉన్న ఆంక్షలు/మళ్లింపులను తొలగించి, మార్గాలను సాధారణ రాకపోకలకు పునరుద్ధరిస్తారు. పౌరులందరూ ఈ మళ్లింపులు మరియు రద్దీ పాయింట్లను గమనించి, తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికిప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్ పేజీ facebook.com/HYDTP మరియు X (ట్విట్టర్) ఖాతా @HYDTP లను పరిశీలించవచ్చు అన్నారు. ప్రయాణంలో ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే లేదా సాయం కావాలంటే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *