బేగంపేట ఆగస్ట్ 13 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలనుపురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) పరిధిలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) బ్యాండ్ బృందం బేగంపేట రైల్వే స్టేషన్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక సంగీత ప్రదర్శన ప్రయాణికులను, వీక్షకులను విశేషంగా అలరించింది. ఈ
కార్యక్రమంలో ఆర్‌పీఎఫ్ బ్యాండ్ సభ్యులు ఆలపించిన పలు దేశభక్తి గీతాలు, ప్రాచుర్యం పొందిన స్వరాలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మార్మోగాయి. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో దేశభక్తి భావనలనుపెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ బ్యాండ్ ప్రదర్శనను చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ వేడుకలో దక్షిణ మధ్య రైల్వే ఆర్‌పీఎఫ్ డీఐజీ-సీఎస్‌సీ ఎం. సురేష్, సికింద్రాబాద్ డివిజన్ ఆర్‌పీఎఫ్ ఏఎస్‌సీ నరేంద్ర కుమార్ వర్మ, సికింద్రాబాద్ ఎస్‌ఐబీ ఇన్‌స్పెక్టర్ డి. శ్రీనివాసరావు, బేగంపేట్ పోలీస్ స్టేషన్ సీఐ సైదులు, హైదరాబాద్ నాంపల్లి ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. సురేష్ బాబు తదితరులు పాల్గొని ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రాధాన్యతను వివరిస్తూ ఆర్‌పీఎఫ్ బృందాన్ని అభినందించారు.
కాగా, ఈ ఆర్‌పీఎఫ్ బ్యాండ్ బృందం ఇప్పటికే ఆగస్టు 9న కాచిగూడ రైల్వే స్టేషన్‌లో, ఆగస్టు 11న నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన సంగీత ప్రదర్శనలకు కూడా ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని అధికారులు వెల్లడించారు.
