రోడ్లపై చెత్త వేస్తే సహించేది లేదు.ప్రకాష్ నగర్ డివిజన్ లో పర్యటించిన జోనల్ కమీషనర్ సచిన్.

బేగంపేట ఆగస్ట్ 13,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
నివాస ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. 261-ప్రకాష్ డివిజన్ పరిధిలోని తాతాచారి కాలనీ నుంచి ఇందిరాగాంధీ పురం వరకు నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో జోనల్ కమిషనర్ సచిన్, ఈసీ డాకు నాయక్, ఏసీపీ గౌరీ శంకర్, ఏసీ వరుణ్, ఎస్‌ఎఫ్‌ఏ సూపర్‌వైజర్ రాజు పాల్గొని పారిశుధ్య పనులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలను పరిశీలించిన అధికారులు, రోడ్లపై వ్యర్థాలను పడేసే వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిని వెంటనే గుర్తించి జరిమానాలు సహా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతకు పౌరులు సహకరించాలని, చెత్తను నిర్దేశిత సేకరణ వాహనాలకే అందించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *