హైదరాబాద్ ఆగస్ట్ 13,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో జప్తు చేసిన, అలాగే రోడ్లపై వదిలేసిన (అనాథ/యాజమాన్యం లేని) విభిన్న రకాలకు చెందిన మొత్తం 2,193 వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. ‘హైదరాబాద్(మెట్రోపాలిటన్ ఏరియా) పోలీస్ యాక్ట్ 2004’ సెక్షన్ 7 మరియు ‘హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్’ సెక్షన్ 40 కింద లభించిన అధికారాల మేరకు ఈ వేలం ప్రక్రియను నిర్వహించనున్నారు.
ఈ వాహనాలపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, లేదా వాహన యాజమాన్య హక్కులు, ఫైనాన్స్/హైపోథికేషన్ క్లెయిమ్‌లు ఉన్నవారు సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ ప్రకటన విడుదలైన తేదీ నుండి ఆరు నెలల వ్యవధిలోబంజారాహిల్స్లోని ఐసీసీసీ (ICCC) భవనంలో ఉన్న సిటీ పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు సమర్పించి తమ
వాహనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోరని, ఆ వాహనాలను వేలం వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.వేలానికి సిద్ధంగా ఉన్న వాహనాల పూర్తి వివరాలు అంబర్పేట్ పోలీస్ ఆసుపత్రి వెనుక ఉన్న SAR CPL పోలీస్ గ్రౌండ్స్‌లోని ‘ఆక్షన్ టీమ్’ వద్ద అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వెబ్సైట్ www.hyderabadpolice.gov.in లో కూడా ఈ వివరాలనుపరిశీలించవచ్చని ప్రకటనలో తెలిపారు.
పోలీసుల స్వాధీనంలో ఉన్న 2,193 వాహనాలకు ఆరు నెలల్లోగా క్లెయిమ్ చేసుకోండి.
13
Aug