బేగంపేట ఆగస్ట్ 13,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ సునీత గ్రేస్ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆగస్టు 15న ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నామని డా.సునీత గ్రేస్ తెలియ జేశారు.ఉచిత వైద్య శిబిరం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చికోటి గార్డెన్స్‌లోని ప్రజయ్ కార్పొరేట్ ఆఫీస్‌లో ఉన్న డాక్టర్ సునీతాస్ ఆయుర్వేద పైల్స్ అండ్ పెయిన్ క్లినిక్‌లో శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.
శిబిరంలో వివిధ అనారోగ్య సమస్యలకు ఉచిత వైద్య సంప్రదింపులుఅందించడంతో పాటు బోన్ డెన్సిటీ పరీక్ష, కొన్ని రక్త పరీక్షలు, ఉచిత మందులు అందించనున్నట్లు తెలిపారు.అదేవిధంగా పైల్స్, ఫిషర్, ఫిస్టులా సమస్యలకు తక్కువ రుసుముతో అవసరమైన చికిత్సా విధానాలు, ఆపరేషన్లునిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నొప్పి నిర్వహణకు కూడా ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
డాక్టర్ సునీతాస్ ఆయుర్వేద పైల్స్ అండ్ పెయిన్ క్లినిక్, G1A, ప్రజయ్ కార్పొరేట్ ఆఫీస్, చికోటి గార్డెన్స్, బేగంపేట. ప్రకాశ్‌నగర్ మెట్రో స్టేషన్, హెర్బలైఫ్ కార్యాలయం సమీపంలో ఉందని,ఆగస్టు 15 న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
సంప్రదించాలని కోరారు.వివరాలకు 9100009695, 9705507833 సంప్రదించాలన్నారు.
వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సునీత కోరారు.

