హర్ ఘర్ తిరంగా న్పూర్తితో ప్రజల్లో దేశభక్తి, జాతీయ నమైఖ్యత భావాన్ని మరింత పెంపొందుతుందని అన్నారు. తాళ్లూరులో వికే ప్రభుత్వ జూనియర్ కశాశాల, హైస్కూల్, కస్తూరి భా విద్యార్థులు తాళ్లూరులో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా మన అందిరికి గర్వానికి ప్రతీక అని, దేశ ఐక్యతను కాడాడటానికి ప్రతి పౌరుడు బాధ్యతగా పనిచెయ్యాలని వక్తలు పిలుపు నిచ్చారు. జెండాలు చేత పూని సైకిల్ పై ర్యాలీ నిర్వహించారు. ఏస్పై మల్లిఖార్జున రావు, వైన్ ప్రిన్సిపాల్ వై వేణుగోపాల్, ఎంఈఓ – 2 సుధాకర్ రావు, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, హెచ్ఎం మిల్టన్, హెచ్ ఎస్ రవి, ఉపాధ్యాయ, నాన్ టీచింగ్ సిబ్బంది సైకిల్ ర్యాలీలో పాల్గొని ఉత్సాహంగా ముందుకు సాగారు. దేశ భక్తి నినాదాల చేస్తూ ఉత్సాహంగా విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. వెల్లంపల్లి బస్టాండ్లో మానవ హారం ఏర్పాటు చేసారు.



