బిజెపి దళిత వ్యతిరేకికాంగ్రెస్ నేతల ఆగ్రహంబన్సీలాల్ పేటలో సత్యాగ్రహ దీక్ష

సికింద్రాబాద్, ఆగస్టు 14,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
భాజపా దళిత వ్యతిరేక వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ్ శంఖనాథ్ ర్యాలీ అనంతరం, శ్రీరామ్ సేన అనే సంస్థ ఆ ప్రాంతాన్ని ‘శుద్ధి’ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా దళిత వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సికింద్రాబాద్ డిసిసి ప్రెసిడెంట్ దీపక్ జాన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్, సనత్‌నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు బన్సీలాల్ పేట జబ్బర్ కాంప్లెక్స్ వద్ద భారీ సత్యాగ్రహ దీక్ష
నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భాజపాకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీక్షలో భాగంగా
10 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం జబ్బర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా
నివాళులర్పించారు. ఆ తర్వాత జబ్బర్ కాంప్లెక్స్ నుంచి బైబిల్ హౌస్ వరకు భారీ పాదయాత్ర
నిర్వహించారు. ఈ సత్యాగ్రహ దీక్షలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ , కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, సికింద్రాబాద్ డిసిసి ప్రెసిడెంట్ దీపక్ జాన్, పిసిసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మీడియాతోమాట్లాడుతూ ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బిజెపి, ఆర్ఎస్ఎస్ వర్గాలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ముగిసిన అనంతరం,బిజెపి-ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఆ ప్రాంగణాన్ని నీళ్లతో కడిగి యజ్ఞం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా, బిజెపి మనస్తత్వంలో ఇంకా అంటరానితనం, దళిత వ్యతిరేక భావజాలం కొనసాగడం పట్ల తీవ్ర ఆవేదన, నిరసన వ్యక్తం చేశారు.పార్లమెంట్ లో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అత్యంత సీనియర్ పార్లమెంటేరియన్ అయిన ఖర్గే ప్రసంగిస్తున్నప్పుడు కూడా బిజెపి నాయకులు అడ్డుపడటం, కామెంట్స్ చేయడం వారి సంస్కృతికి నిదర్శనమనివిమర్శించారు. సోనియా గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలందరూ పార్లమెంట్ లోనూ, బయటా బిజెపి వైఖరిని తీవ్రంగా నిరసించారని పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై అరాచకాలు, వివక్ష పెరిగిపోయాయని, జాతీయ పార్టీ అధ్యక్షుడి స్థాయి వ్యక్తికే ఇటువంటి అవమానం ఎదురవడంపై ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాలనిపిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు చేపట్టిన
ఈ నిరసన కార్యక్రమం కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో దళితుల హక్కుల కోసం, బిజెపి దళిత వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *