“హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..బిజెపి యువ నాయకులు మర్రి పురురవ రెడ్డి పిలుపు.

సనత్ నగర్ ఆగస్ట్ 13,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగా
కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం సనత్ నగర్ డివిజన్ నెహ్రూ పార్క్ నుండి కే ఎల్ ఎన్ పార్క్ వరకు జరిగిన తిరంగా ర్యాలీ లో మర్రి పురురవ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. జాతీయ జెండా మన స్వాతంత్ర్యానికి,త్యాగాలకు, ఐక్యతకు గుర్తు. ప్రతి భారతీయుడు గర్వంగా త్రివర్ణ పతాకాన్ని తన ఇంటిపై ఎగురవేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు బి. శ్యామ్ సుందర్ గౌడ్ , రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు E. దయానంద్ , సనత్ నగర్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఆకుల మహేష్ , డివిజన్ అధ్యక్షులు నరేష్ , డివిజన్ ప్రధాన కార్యదర్శి వి సత్యనారాయణ, సుధాకర్ సీనియర్ నాయకులు క్రాంతి కుమార్ , శ్రీశైలం గౌడ్ , రామమోహన్ , నర్సింగ్ రావు , పి. నరేందర్ , అశ్వినీ , వినయ్ , చంద్ర కుమార్ , అజయ్ , అను దీప్ రెడ్డి , లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *