ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నాలుగవ యాక్టివిటీ అయినటువంటి తిరంగా ర్యాలీ గురువారం తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల ఎంఈవో సుబ్బయ్య, హెడ్మాస్టర్ వైఎస్ఆర్ కే ప్రసాద్, పవన్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, కాజావాలి, శ్రీహరి, మస్తాన్, బాజీ, తదితర సిబ్బంది, విద్యార్థులు కలిసి బొద్దుకూర పాడు బస్ స్టాండ్, తాళ్లూరు బస్ స్టాండ్, పోలేరమ్మ గుడి, సచివాలయం మీదగా ర్యాలీ నిర్వహించి, దేశ, ఔన్నత్యాన్ని, దేశ అభివృద్ధిని ప్రజలకు చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఎలిమెంటరీ స్కూల్ 4,5 తరగతుల విద్యార్థులు హెచ్ఎం సునీత మరియు ఆ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈవో సుబ్బయ్య మాట్లాడుతూ, మన దేశానికి రెండు కళ్లు జవాన్ మరియు కిసాన్ అనీ, వారిద్దరూ చక్కగా ఉంటే దేశం అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుంది అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ వైఎస్ఆర్ కే ప్రసాద్ మాట్లాడుతూ, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకొని పోతోంద ని అన్నారు. వందే మాతరం నినాదాలతో ర్యాలీ గ్రామ ప్రజలను అలరించింది.


