బేగంపేట ఆగస్టు 15, (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఎందరో మహనీయుల పోరాటం, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్దించిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, మోండా డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు కొండాపురం మహేష్ యాదవ్, ఆనంద్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
పద్మారావు నగర్ లో
పద్మారావు నగర్ లోని NTR విగ్రహం వద్ద నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. అనంతరం శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పద్మారావు నగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి, నాయకులు ఏసూరి మహేష్, అంబులెన్స్ సురేష్, వెంకటరమణ, బాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మహేందర్ గౌడ్, పుశ్వంత్ రెడ్డి, అనిత రెడ్డి, నాగలక్ష్మి,కౌసల్య, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
బన్సీలాల్ పేట లో..
బన్సీలాల్ పేట డివిజన్ లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్, కుమార్ యాదవ్, రాజేందర్, అబ్బాస్, ఫహీం, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
మోండా డివిజన్…
మోండా డివిజన్ లోని పాలికా బజార్ సర్కిల్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు గందే నాగులు, కొండాపురం మహేష్ యాదవ్, సత్యనారాయణ, జయరాజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
రాంగోపాల్ పేట డివిజన్..
రాంగోపాల్ పేట డివిజన్ లోని నాగేల్లి దుర్గయ్య స్కూల్, బెంగాలీ సమాజ్ ఆధ్వర్యంలో జనరల్ బజార్ లలో నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని జాతీయ పతాకాలను ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, రాంమోహన్ యాదవ్, పబ్బా ప్రకాష్, అబుల్ ఆనంద్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
బేగంపేట డివిజన్…
బేగంపేట డివిజన్ పరిధిలోని రసూల్ పురా సర్కిల్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి. మహేశ్వరి, నాయకులు టి. శ్రీహరి, నరేందర్, శేఖర్, ఆరీఫ్, ప్రవీణ్, అడ్డు తదితరులు పాల్గొన్నారు.
ఆమీర్ పేట డివిజన్
అమీర్ పేట డివిజన్ సత్యం థియేటర్ సర్కిల్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం బాపు నగర్ లో నిర్వహించిన వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు దాడి ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, గుడిగే శ్రీనివాస్ యాదవ్, పీయూష్ గుప్త, గౌతమ్, సీనియర్ సిటిజన్ పార్థసారథి, సుమిత్ సింగ్, గులాబ్ సింగ్, గోపీలాల్ చౌహాన్, హరిసింగ్, లలితా చౌహన్ దర్శన్ సింగ్, రాణి కౌర్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
సనత్ నగర్ డివిజన్…
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సనత్ నగర్ డివిజన్ లోని బస్టాండ్, ఆయుర్వేదిక్ పార్క్, అల్లా ఉద్దీన్ కోటి లలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ఖలీల్, కరీం లాలా, ఫాజిల్, జమీర్, పురుషోత్తం, నోమాన్, వసీం, సమి ఉల్లా, ఇబ్రహీం, పుష్పాలత, పద్మ తదితరులు పాల్గొన్నారు.








