
త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని అప్పుడే నిజమైన ప్రగతి సాధించినట్లవుతుందని మండల వ్యవసాయాధికారి, శివరామపురం, విఠలాపురం, లక్కవరం ప్రత్యేక అధికారి బి ప్రసాద రావు అన్నారు. శివరామపురంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని అభివృద్ధి వైపు పయనించాలని కోరారు. గ్రామకార్యదర్శి షహనాజ్ బేగం, శివ పార్వతి, సర్వేయర్ శ్యాం, మాజీ ఎంపీటీసీ గాడిపర్తి లక్ష్మినారాయణ, హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

రజానగరంలోని జెడ్పీహెచ్ఎస్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు మోహన్ గాంధీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జెండా వందనం చేసి స్వాతంత్య్ర సాధనలో వీరుల త్యాగాలను వివరించారు. విద్యార్థులు మంచి విద్యార్థులుగా, పౌరులుగా ఎదిగిన నాడు మంచి దేశ భక్తులు అవుతారని ఆవిధంగా తయారు కావాలని వక్తలు కోరారు. స్కూల్ కమిటీ చైర్మన్ ఆగాల గోపి, మాజీ సర్పంచి వలి, ఎఎంసీ డైరెక్టర్ కాలేషా వలి, ఎంపీటీసీ మేడగం వెంకట రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆగాల సుబ్బా రావు తదితరులు పాల్గొన్నారు .
