బేగంపేట ఆగస్ట్ 20,(జె ఎస్ డి ఎం న్యూస్)
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీలంక బస్తీ లో పోలీసులు నిర్బంద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 300కు పైగా పోలీసులు పాల్గొన్నారు. శ్రీలంక బస్తీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ నిర్బంధ తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేని 29 ద్విచక్రవాహనాలతో పాటు ఐదు మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరో నలుగురిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వారికి సంబంధించిన ఆధారాలను అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన మూడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు ప్రజలలో శాంతి భద్రతల పట్ల భరోసా కల్పించేందుకు ఈ నిర్బంధ తనిఖీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ తనిఖీలు మల్కాజ్ గిరి పోలీస్ కమీషనర్ బి.సుమతి ఆదేశాల మేరకు డిసిపి శ్రీధర్ పర్యవేక్షణలో బేగంపేట పేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి, ఇన్స్పెక్టర్ సైదులు శ్రీలంక బస్తీలో విస్తృతంగా ఇంటింటిని సోదాలు చేపట్టారు.


