ఇరుకు రోడ్డుకు విముక్తి.బేగంపేటదనియాలగుట్ట ఇందిరా గాంధీ పురం ప్రధాన రహదారిపై ఆక్రమణల తొలగింపు.రోడ్లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు

బేగంపేట ఆగస్ట్ 20,(జే ఎస్ డి ఎం న్యూస్)
ఆక్రమణలతో ఇరుకుగా మారిన రోడ్డు పై ఉన్న ఆక్రమణలను మల్కాజ్ గిరి ట్రాఫిక్ పోలీసులు, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అధికారులు సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తొలగించారు. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం తొలగినట్లు అయింది. శ్యామ్ లాల్ బిల్డింగ్ నుంచి ఇందిరా గాంధీపురం ఫతేనగర్ వెళ్లే ప్రధాన రోడ్డుపై కొందరు చెత్తాచెదారం తోపాటు వివిధ రకాలైన వస్తువులను వేసి రోడ్డు కుచించుకు
పోయేటట్లు చేశారు. ఈ గమనించిన తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్రాజు గురువారం హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి అధికారుల సహకారంతో జెసిబి లను ఉపయోగించి రోడ్లపై ఉన్న చెత్తాచెదారాన్ని ఆక్రమణలు తొలగింపజేశారు. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాఫీగా ప్రయాణించారు.
మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఆదేశాల మేరకు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కే రాహుల్ రెడ్డి ట్రాఫిక్-1, పర్యవేక్షణలో,బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దనియాలగుట్ట ఇందిరా గాంధీపురం ఫతేనగర్ ప్రధాన రహదారి ఇరువైపులా రహదారి ఆక్రమణల తొలగింపు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
బేగంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న అక్రమఆక్రమణలతో పాటు, ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న రహదారి ఆక్రమణలను తొలగించారు. దీంతో రహదారి విస్తీర్ణం పూర్తిగా అందుబాటులోకి వచ్చి, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రాకపోకలు సాఫీగా సాగేందుకు మార్గంసుగమమైంది.ఆక్రమణల కారణంగా గతంలో రహదారిపై వాహనాల రాకపోకలు ఒక వైపు మాత్రమే సాగేవి. ఆక్రమణలను తొలగించిన అనంతరం ప్రస్తుతం రహదారి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది.రెండు వైపులా వాహనాలు సాఫీగా ఎటువంటి అంతరాయం లేకుండా రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడింది.దీంతో వాహనదారులకు, స్థానిక ప్రజలకు మరింత సౌకర్యం మరియు భద్రత కల్పించబడింది.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్రాజు. టౌన్ ప్లానింగ్ ఏసిపి టి ఎల్ రమేష్ కుమార్ , ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాస్, బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, అలాగే
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *