వరలక్ష్మీ వ్రతం కోసం గాజుల అలంకారం…బేగంపేట ఆగస్ట్ 20,(జే ఎస్ డి ఎం న్యూస్)వరలక్ష్మి వ్రతం సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయాన్ని గాజులతో సుందరంగా అలంకరించారు. ఆలయ ఈవో జి. మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో వివిధ రకాలైన పూల తో పాటు వివిధ రకాలైన గాజులతో ఆలయ ప్రాంగణం మొత్తాన్ని అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగులు, గాజుల అలంకరణ ఆలయం మొత్తం దగదగా మెరిసిపోతుంది.శ్రావణమాసం శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించుకోనున్నారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని దేవాలయాన్ని వివిధ రకాలైన గాజులతో అలంకరించినట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైన ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి తెలియజేశారు.


