ల్యాపరోస్కోపిక్ సర్జరీతో మూడవ గర్భంలో ఆరోగ్యవంతమైన శిశువు. మెక్‌డొనాల్డ్ సెర్క్లాజ్ విఫలమైన మహిళకు 14వ వారంలో ట్రాన్స్-అబ్డోమినల్ సెర్క్లాజ్ .కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ వైద్యుల విజయవంతమైన చికిత్స.

హైదరాబాద్, ఆగస్టు 21, (జే ఎస్ డి ఎం న్యూస్ )
వరుసగా రెండుసార్లు గర్భస్రావమైన మహిళకు మూడో గర్భధారణలో అత్యంత క్లిష్టమైన ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేసి, పూర్తి కాలం వరకు గర్భాన్నివిజయవంతంగా కొనసాగించి ఆరోగ్యవంతమైన మగ శిశువు జన్మించేలా కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ వైద్యులు చేసిన కృషి తో పలువురి మన్ననలు పొందుతున్నారు. గతంలో సాధారణ సెర్క్లాజ్ విఫలమైన నేపథ్యంలో, 14వ వారంలోల్యాపరోస్కోపిక్ట్రాన్స్-అబ్డోమినల్ సెర్క్లాజ్ (TAC) చేసినట్లు సీనియర్ కన్సల్టెంట్ & లీడ్
యూరోగైనకాలజిస్ట్ డాక్టర్ ఎన్. బిందు ప్రియ తెలిపారు. మహిళకు మొదటి గర్భం 16వ వారంలో, రెండో గర్భం 18వ వారంలో గర్భ స్రావం జరిగింది. రెండో గర్భధారణలో గర్భాశయ ముఖద్వారానికి యోని మార్గం ద్వారా మెక్‌డొనాల్డ్ సెర్క్లాజ్ చేసినప్పటికీ గర్భాన్ని నిలబెట్టుకోలేకపోయారు.
కొంతమంది మహిళల్లో బిడ్డ పెరుగుతున్న సమయంలో గర్భాశయాన్ని మూసి ఉంచాల్సిన గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) బలహీనంగా ఉంటుంది. దీనిని సర్వైకల్ ఇన్‌సఫిషియెన్సీ అంటారు. నొప్పులు లేకుండానే సర్విక్స్ ముందుగానే తెరుచుకుంటే 4–5 నెలలకే గర్భస్రావం లేదా అత్యంత ముందస్తు ప్రసవం జరిగే ప్రమాదం ఉంటుంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో చేసిన సెర్క్లాజ్ విఫలమైనందున ఈ మహిళకు 14వ వారంలో ల్యాపరోస్కోపిక్ ట్రాన్స్-అబ్డోమినల్ సెర్క్లాజ్ చేశారు. పొత్తికడుపుపై పెద్ద కోత లేకుండా చిన్న రంధ్రాల ద్వారా పరికరాలను పంపించి, గర్భాశయం–సర్విక్స్ కలిసే ప్రాంతంలో బలమైన కుట్టును ఉంచారు.సులభంగా చెప్పాలంటే, బిడ్డ బయటకు వచ్చే మార్గం ముందుగానే తెరుచుకోకుండా ఈ కుట్టు “సపోర్ట్ బెల్ట్”లాపనిచేస్తుంది
ఈ శస్త్రచికిత్స చేయకపోతే సర్విక్స్ మళ్లీ ముందుగానే తెరుచుకుని గర్భస్రావం లేదా అత్యంత ముందస్తు ప్రసవం జరిగే ప్రమాదం ఉండేదని తెలిపారు. అయితే ప్రతి రోగి పరిస్థితిని బట్టి చికిత్స నిర్ణయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. “గతంలో రెండోత్రైమాసికంలో గర్భస్రావాలు జరిగిన మహిళలను తదుపరిగర్భధారణలో ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. సాధారణ సెర్క్లాజ్ విఫలమైన ఎంపిక చేసిన కేసుల్లో ట్రాన్స్-అబ్డోమినల్ సెర్క్లాజ్ ద్వారా గర్భాన్ని నిలబెట్టే అవకాశాలను మెరుగుపరచవచ్చు అని డాక్టర్ బిందు ప్రియ తెలిపారు.
శస్త్రచికిత్సఅనంతరం మహిళను నిరంతరంపర్యవేక్షించగా,పూర్తిగర్భకాలం అనంతరం ఆరోగ్యవంతమైన మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ బిందు ప్రియతో పాటు డాక్టర్ సింధూర, డాక్టర్ సాయి స్నేహిత పాల్గొన్నారు. గతంలో 3–4 నెలల తర్వాత పదేపదే గర్భస్రావాలు జరిగిన మహిళలు తదుపరి గర్భధారణలో నిపుణుల సలహా తీసుకోవాలని వైద్యులు సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *