తాళ్లూరు మండలంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా గుంటి గంగా భవాని ఆలయంతో పాటు పలు ఆలయాలలో మహిళలు భక్తి శ్రర్థలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొద్దికూరపాడు శ్రీ గంగా పర్వత వర్దిని ఆలయంలో మహిళలు అందరూ శుక్రవారం రాత్రి వ్రతం, కుంకుమ పూజ నిర్వహించారు. శుక్రవారం పండుగ రావటంతో మహిళలు ఆలయాన్ని, ఆమ్మవారికి పలు రకాలు పూజలు, గాజులతో సుందరంగా అలకంరించారు. ఆలయ పూజారి నుదురు పాటి వెంకట రమణయ్య. ఉద్దండం రమణయ్య. శివాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించారు.




