తూర్పుగంగవరంలో తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జునరావు గురువారం రాత్రి పల్లె నిద్ర చేసారు. ఆయన సిబ్బందితో కలిసి తూర్పుగంగవరంలో గ్రామస్తులతో పాటు కలియ తిరిగి గ్రామంలో ఎవైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న విషయాలను చర్చించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చట్టాలపై, సైబర్ నేరాలపై, ఆర్థిక నేరాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. అసాంఘిక కార్యక్రమాలు ఎవైనా ప్రజలు దృష్టికి వస్తే తమ దృష్టికి తీసుకురావాలిని కోరారు.
