పంచాయ తీ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో శనివారం సమావేశం నిర్వ హణ . …… రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ/వార్డుల వారీగా క్షేత్రస్ధాయిలో ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి…….క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ సమర్థవంతమైన సేవల ద్వారా జిల్లా పోలీస్‌శాఖకు గుర్తింపు తీసుకురావాలి…….జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు

జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరసమీక్షా సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ ముఖ్యంగా దర్యాప్తులో ఉన్న హత్య, POCSO /రేప్ కేసులు, ప్రాపర్టీ నేరాలు, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, పెండింగ్ లో ఉన్న కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్, పెండింగ్ NBWs పై CCTNS మరియు రానున్న స్ధానిక ఎన్నికలపై సమీక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల నమోదు, నిందితుల అరెస్టు, విచారణ, ఛార్జీషీటు దాఖలు మరియు పెండింగ్ కేసులు తదితర అంశాలపై పోలీస్ అధికారులను ఆరా తీశారు. నేర నియంత్రణ, నేరాల ఛేదించుట, అసాంఘిక కార్యకలాపాల కట్టడి మరియు శాంతి భద్రతలకు పరిరక్షణకు అధికారులకు పలు కీలక సూచనలు మరియు మెళకువలను తెలియజేసారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక కార్యచరణతో ప్రణాళికా బద్ధమైన చర్యలు తీసుకోవాలని, కేసులలో సమగ్ర దర్యాప్తు చేసి, మహిళా సంబంధిత నేరాల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట సమయం లోపల బాధితులకు న్యాయం అందించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఫోక్సో/రేప్‌, క్రైమ్‌ అగైనెస్ట్‌ ఉమెన్‌, ప్రాపర్టీ కేసుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అలాగే ఆయా కోర్టు కేసులలో శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

పోలీస్ స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించుకోవాలని, వీలైనంత త్వరగా పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలని, అరెస్టులు, చార్జ్ షీట్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికలను శాంతియుతంగా జరిపించేలా ప్రణాళికా బద్దంగా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామపంచాయతీ మున్సిపాలిటీ ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ స్టేషన్ లొకేషన్, పోలింగ్ బూత్లను విజిట్ చేయాలని, సమస్యాత్మక/అతి సమస్యాత్మక ప్రాంతాల సమాచారం, అక్కడ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, క్షేత్రస్థాయిలో పరిశీలించి సమాచారం తీసుకోవాలన్నారు

అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించాలని గతంలో ఉన్నా పాత ముద్దాయిలపై బైండ్ ఓవర్ చేయాలని, ఎన్ఫోర్స్మెంట్ చేయాలని పలు అంశాలపై ప్రజలు అవగాహన కల్పించాలన్నారు.మహిళలు/చిన్నారులకు సంబంధించిన కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడుపులో చార్జిషీట్ ను దాఖలు చేయాలన్నారు.

స్మార్ట్ పోలీసింగ్ సాంకేతికత అప్లికేషన్లో భాగంగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ & సిస్టమ్ (CCTNS), సీసీటీవీ నిఘా, డ్రోన్ సర్వైలెన్స్ మరియు ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంతంగా వినియోగించి నేరాలను ముందుగానే గుర్తించి, ప్రజలకు వేగవంతమైన మరియు పారదర్శక సేవలు అందించవచ్చని తెలిపారు.

సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని, సీసీటీఎన్ఎస్ లో ఎఫ్ఐ ఆర్ మొదలుకొని కేసు డిస్పోసల్ వరకు ప్రతి ఒక ఫైల్ ను సిసిటిఎన్ఎస్ లో అప్లోడ్ చేయాలన్నారు.

పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని, పోలీసు అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా పని చేయాలని, ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి భాదితులకు న్యాయం చేకూరుస్తామనే భరోసా కల్పించాలన్నారు.

ఈ నేర సమీక్ష సమావేశంలో మార్కాపురం OSD నవజ్యోతి మిశ్రా , అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, అడిషనల్ ఎస్పీ (క్రైమ్) సిహెచ్ వెంకటేశ్వర్లు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి శ్రీధర్ బాబు, దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ, మార్కాపురం యు.నాగరాజు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *