త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా వుండాలి -ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ నాగేశ్వరరావు , . జడ్పీసీవో చిరంజీవి – పంచాయ తీ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహణ

గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు అప్రమత్తంగా వుంటూ పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ నాగేశ్వరరావు తెలిపారు. తాళ్లూరు మండల పరిషత్ స మావేశం హాలులో త్రాగునీటి సరఫరాపై ఎంపీడీవో పిఅజిత అధ్యక్షతన పంచాయ తీ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో శనివారం సమావేశం నిర్వ హించారు. గ్రామాల్లో రామతీర్థం మంచినీరు సరఫరా సక్రమంగా వున్నదీ లేనిది చూసుకోవాలన్నారు. గ్రామాల్లో రామతీర్థం నీరు సరఫరా నిలిస్తే ప్రత్యామ్నాయ. మార్గాల ద్వారా నీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు. ప్రజలకు నీటి సరఫరాలో కొరత లేకుండా చూడాలన్నారు. ఏదైనా ప్రాబ్లంవస్తే తక్షణమే పరిష్కరించాలన్నారు గ్రామాల్లోని వాటర్ ట్యాంకు ల లో షెడ్యూల్ ప్రకారం క్లోరినేషన్ చేయించాలన్నారు. రామతీర్థం రిజర్వాయర్ వద్ద పంప్ హౌస్ లో మోటార్లను కేబుల్ వైర్ ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు మంచినీరు సరఫరా చేస్తున్నామన్నారు. అనివార్య కారణాల వల్ల నీటిసరఫరా నిలిస్తే ప్రజలు ఇబ్బందులు పడకుండా వుండేందుకు తగు ప్రణాళికలు రూపొందించారు. జడ్పీసీవో చిరంజీవి మాట్లాడుతూ మంచి నీటి సమస్య పరిష్కారంలో ఆర్డబ్ల్యుఎస్ అధికారులే చూసుకుంటారులే అన్నట్లు పంచాయతీ అభివృద్ధి అధికారులు మిన్నకుండా వుండకుండా నీటి సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీ నిధులు వెచ్చించి ట్యాంక్ల వద్ద క్లోరినే షన్ యంత్ర పరికరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కొర్రపాటివారిపాలెంలో ….ట్యాంక్ నిర్మాణ పనులు పూర్తయినా ఎందుకునీరు వెళ్లలేదని ఆర్డబ్ల్యుఎస్ ఏఈని ప్రశ్నించారు. గ్రామంలో రాజకీయ జోక్యం వల్ల నిలిచి పోయిందని తెలుపగా తాను ఆసమస్యను పరిష్కరించి నీటి విడుదలకు చర్యలు చేపడతానన్నారు. మల్కాపురం, తురకపాలెం గ్రామాలకు వెళ్లే పైప్ లైన్ దెబ్బతినటం వల్ల నీరు వెళ్లటం లేదని గమనించిన అధికారులు మరమ్మత్తులకు నిధులు మంజూరు చేసి ఆరెండు గ్రామాలకు నీరు అందేలా చూస్తామన్నారు. రెండునెలలపాటు గ్రామాల్లో పంచాయతీ అధివృద్ది అధికారులు త్రాగు నీటి సమస్యపై దృష్టి సారించి సమస్యలు తలెత్త కుండా చూడాలన్నారు. ఈసమావేశంలో ఎంపీడీవో పి.అజిత ఆర్
డబ్ల్యుఎస్ డీఈ శ్రీనివాసరావు, ఏఈ వాలీ, పంచాయతీ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

వెలుగుమహిళా సభ్యులకు టాయిలెట్స్ నిర్మాణంకు కోసం స్థలాన్ని పరిశీలించిన ఎస్ఈ

మండల కాంప్లెక్స్ పరిధిలో గల వెలుగు కార్యాలయంకు పనుల నిమిత్తం వచ్చే పొదుపుమహిళలకు టాయిలెట్స్ నిర్మాణం కోసం రూ. 18లక్షల నిధులు మంజూరు కాగా అనువైన స్థలాన్ని ఆర్డబ్యుఎస్ పరిశీలించారు. కాంప్లెక్స్ ఆవరణలో గల రెండూ మూడు చోట్ల స్థలాలను పరిశీలించారు. రైతు సేవా కేంద్రం వెనుక వెనుక వైపున గల స్థలం అనువైనదిగా గుర్తించి స్థలాన్ని టాయిలెట్స్ నిర్మాణంకు కేటాయి
స్తున్నట్లు తీర్మాణం ఇవ్వాలని ఎంపీడీవోకు సూచించారు. వెంటనే టెండర్లు పిలిచి
పనులు ప్రారంభిస్తామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో పి. అజిత ఆర్డబ్ల్యుఎస్ డీఈ శ్రీనివాసరావు, ఏఈ వాలీ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *