కొత్తపాలెం గ్రామ సంఘం నియామకంలో వెలుగు ఏపీఎం, సీసీలు సెర్ఫ్ నిబంధనలకు భిన్నంగా ఒకే సామాజిక వర్గం మహిళలను ఏకపక్షంగా నియమించారని, గ్రామైఖ్య సంఘం నియామకంపై విచారణ జరిపించి అన్ని వర్గాల మహిళలకు స్థానం కల్పించాలనిమండల సమాఖ్య అధ్యక్షురాలు మారాబత్తుల సుజాత డిఆర్డీఏ పీడీకి శుక్రవారంఫిర్యాదు చేశారు. కొత్తపాలెం గ్రామసంఘానికి చెందిన విఓఏ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయగా ఏపీఎం ఆమోదించి కొత్తవారిని నియమించేందుకు చర్యలు చేపట్టార న్నారు. కొత్త విఓఏ ను నియమిస్తున్నామని, పాత ఓబిలో ఇద్దరు తొలుగుతున్నారని ఏపీఎం, సీసీలు పొదుపు గ్రూపులీడర్లకు సమాచారం ఇచ్చారన్నారు.
సెర్ఫ్ నిబంధ నల మేరకు ఓబిలో ఇద్దరికి మాత్రమే తొలగించాల్సి వుండగా మొత్తం గ్రామ సంఘాన్ని రద్దు చేసినట్లు 5గురు కొత్తవారిని ఒకేసామాజిక వర్గానికి చెందిన వారిని నియమిస్తున్నట్లు తీర్మా నించారన్నారు. గ్రామంలో 35 పొదుపు గ్రూపులుండగా 5 బీసీ గ్రూపులు, కొందరు ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు వుండగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించారన్నారు. వెలుగు సెర్ఫ్ నిబంధన లకు భిన్నంగా ఏపీఎం, సీసీ ల సహకారంతో గ్రామ సంఘాన్ని నియమించార
న్నారు. కొత్తపాలెం గ్రామ సంఘాన్ని రద్దు పరిచి సెర్ఫ్ నిబంధనల మేరకు అన్ని సామాజిక వర్గాల మహిళలకు ప్రాధాన్యత నివ్వాలని, నిబంధనలు భిన్నంగా వ్యవహరించిన ఏపీఎం, సీసీలపై తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.