ఒంగోలులో 20 మంది మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్ -మహనీయుల సేవలు భావితరాలకు తెలియజేయడమే లక్ష్యం -ప్రకాశం జిల్లా సంస్కృతి, పశుసంపదకు ఒంగోలు గిత్త (ఎద్దు) ప్రతీక -మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరణ

ఒంగోలు,కిమ్స్ ఆసుపత్రి జంక్షన్: సమాజానికి విశిష్ట సేవలందించిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఒంగోలులోని KIMS హాస్పిటల్ ఫ్లై ఓవర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంగోలు నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచే ఒంగోలు గిత్త విగ్రహాన్ని కూడా మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

స్ఫూర్తిదాతల ఆలోచనలు నేటి యువతకు తెలియజేసేలా విగ్రహాల ఏర్పాటు
KIMS హాస్పిటల్ జంక్షన్ వద్ద 20 మంది ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు ఒంగోలు నగరానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వివిధ రంగాల్లో స్ఫూర్తిదాయక సేవలు అందించిన మహనీయులను స్మరించుకునే అవకాశం కల్పించడం ద్వారా వారి గొప్పతనాన్ని నేటి తరానికి పరిచయం చేసే లక్ష్యంతో విగ్రహాలను ఏర్పాటు చేశారు. వారి జీవితాలు, సేవలు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు నేటి యువతకు, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని మంత్రి లోకేష్ అన్నారు. సామాజిక, సాంస్కృతిక, విద్యా, రాజకీయ, సాహిత్య తదితర రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖుల విగ్రహాలను ఒకేచోట ఏర్పాటు చేయడం అభినందనీయమని లోకేష్ అన్నారు. ప్రజలకు నిత్యం కనిపించే ప్రాంతంలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా మహనీయుల సేవలు, త్యాగాలు, వారి ఆశయాలు ప్రజలకు మరింత చేరువవుతాయని తెలిపారు.

ఒంగోలుకు మరో ప్రత్యేక ఆకర్షణగా ఒంగోలు గిత్త విగ్రహం

ఒంగోలు జాతి పశువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక గుర్తింపును చాటిచెప్పేలా కిమ్స్ ఆసుపత్రి జంక్షన్ వద్ద ఒంగోలు గిత్త విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఏర్పాటు చేశారు. ఒంగోలు గిత్త విశిష్టతను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, ప్రకాశం జిల్లా సంస్కృతి, పశుసంపదకు ఇది ప్రతీకగా నిలవనుంది.

ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్ రావు, ఉగ్ర నరిసింహారెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించిన విగ్రహాలు:

  1. శ్రీ రొండా నారపరెడ్డి – మాజీ మంత్రి, మాజీ ఎంపీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
  2. శ్రీ దర్శి చెంచయ్య – స్వాతంత్ర్య సమరయోధుడు.
  3. శ్రీ మాదాల నారాయణ స్వామి (MNS) – మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, భారత్-చైనా మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు.
  4. శ్రీ నీలంరాజు వెంకట శేషయ్య – తెలుగు సాహితీవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ పాత్రికేయులు.
  5. శ్రీ కత్తి చంద్రయ్య – ప్రకాశం జిల్లా మొట్టమొదటి కలెక్టర్.
  6. శ్రీ వరదా శ్రీరాముల నాయుడు – ఒంగోలు తొలి పురపాలక సంఘ అధ్యక్షులు, నాలుగు సార్లు చైర్మన్‌గా సేవలు.
  7. శ్రీ బివియల్ నారాయణ – ‘పావలా డాక్టర్’, పేదల డాక్టర్‌గా పేరుగాంచిన వైద్య శిఖామణి.
  8. శ్రీ క్లౌ జాన్ ఎవరెట్ – సామాజిక సేవకులు.
  9. శ్రీ గోరంట్ల వెంకన్న – మహాదాత.
  10. శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి – ఆధునిక ద్రావిడ భాషాశాస్త్ర పితామహుల్లో ఒకరు.
  11. శ్రీమతి భానుమతి రామకృష్ణ – ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు.
  12. శ్రీమతి గరికపాటి వరలక్ష్మి – ప్రముఖ నటి, గాయని, నిర్మాత, దర్శకురాలు.
  13. శ్రీ టి. కృష్ణ – ప్రముఖ దర్శకులు, నిర్మాత, రచయిత.
  14. పద్మశ్రీ షేక్ చినమౌలానా – ప్రముఖ నాదస్వర విద్వాంసులు.
  15. శ్రీ ధారా రామనాథ శాస్త్రి – నాట్యావధాని, ప్రముఖ సాహితీవేత్త.
  16. శ్రీ నాగభైరవ కోటేశ్వరరావు – ప్రముఖ కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత.
  17. శ్రీ కలేకూరి ప్రసాద్ – కవి, రచయిత, అనువాదకులు, దళిత విప్లవకర్త.
  18. శ్రీ పైడి తెరేష్ బాబు – ప్రముఖ హార్మోనిస్ట్, తబలా వాయిద్యకారులు, కవి, గాయకుడు, రచయిత, దళిత సాహితీవేత్త.
  19. శ్రీ మల్లవరపు జాన్ – రచయిత, కవి, సాహితీవేత్త.
  20. శ్రీ బండారు రామారావు – నాటక సమాజ నిర్వాహకులు, ఉపాధ్యాయులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *