బేగంపేట సెప్టెంబర్ 5, (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
ఉపాధ్యాయులు కేవలం విద్యను బోధించేవారు మాత్రమే కాదనీ,వారు విద్యార్థుల్లో మంచి వ్యక్తిత్వాన్ని ,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి,
సమాజానికి బాధ్యతగల పౌరులనుఅందించేమార్గదర్శకులు అని మన్సూరా సైబర్ హైస్కూల్ కరస్పాండెంట్ ,అడ్వకేట్ మహ్మద్ ముదస్సిర్ జుహా అన్నారు.శనివారం ప్రకాశం నగర్ మన్‌సూరా సైబర్ హై స్కూల్‌లోఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అందిస్తున్న అమూల్యమైన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమానికి మన్‌సూరా సైబర్ హై స్కూల్ మాజీ వైస్ ప్రిన్సిపాల్ ఆదిలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ తాను ఈ విద్యాసంస్థలో 26 సంవత్సరాలకు పైగా అంకితభావంతో సేవలందించానని ,గుర్తు చేసుకున్నారు.ఎన్నో తరాల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పాఠశాల యాజమాన్యం తనకు సహాయ సహకారాలు అందించారని అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయుల పట్ల ప్రేమ, గౌరవం మరియు కృతజ్ఞతను తెలియజేస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. విద్యార్థుల ఆకట్టుకునే ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక శోభను నింపాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అడ్వకేట్ మహ్మద్ ముదస్సిర్ జుహా, ప్రిన్సిపాల్ ఎం. సుష్మ, ఇంజనీర్ మహ్మద్ ముజమ్మిల్ జుహాతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.


