తాళ్లూరు మండలంలో సీనియర్ వైసీపీ నాయకుడు, దశాబ్దకాలంగా జెడ్పీటీసీగా పనిచేస్తున్న మారం తాళ్లూరు: మండలంలో సీనియర్ వైసీపీ నాయకుడు, దశాబ్దకాలంగా జెడ్పీటీసీగా పనిచేస్తున్న మారం వెంకట రెడ్డి, బెల్లంకొండ వారి పాలెం మాజీ నర్పంచి నుమలత, పోశం శ్రీకాంత్ రెడ్డి లు శనివారం జనసేన గూటికి చేరారు. జనసేన రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డి సమక్షంలో హైదరాబాద్ లో ఆయన నివాసంలో పార్టీ కండువా కప్పి జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి , పోశం శ్రీకాంత్ ల ను జనసేన లోనికి ఆహ్వానించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి కుటుంబం ఆది నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆయన తండ్రి మారం వెంకట నుబ్బా రెడ్డి నర్పంచిగా రాష్ట్ర కిసాన్ సెల్ డైరెక్టర్ గా , పార్టీ అధిష్టానానికి నిత్యం టచ్ లో ఉంటూ దివంగత సీఎం ys సైతం నేరుగా పెరుపెట్టి పిలిచే అంత పట్టు సాధించారు. అదే కోవలో మారం సైతం బాలినేనికి యూత్ నుండే అనుచరుగా ఉంటూ కాంగ్రెన్ లో కీలకంగా వ్యవహరించారు. అనంతరం వైసీపీలో సైతం బాలినేని, వైవీ, మద్దిశెట్టి బ్రదర్స్ ల అండగా తన దైన శైలీలో మండలంలో ఏక పక్షంగా రాజకీయం నడిపించారు. 20214, 2022లలో సైతం అధిష్టానం జోక్యంతో వరుసగా జెడ్పీటీసీగా ఎన్నిక కావటం విశేషం. 2024లో సైతం ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి విజయానికి కృషి చేసారు. ఓటమి అనంతరం పలు కారణాలతో వైసీపీకి దూరం జరుగుతూ వచ్చారు. తన అభిమాన నాయకుడు జనసేన వైపు మొగ్గు చూపటంతో మారం సైతం ఆవైపుగా అడుగులు వేసారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమంలో పార్టీలో చేరేందుకు ముహర్తం కుదరక పోవటంతో చేరిక పలు మార్లు వాయిదా పడుతూ వచ్చాయి. స్థానిక ఎన్నికల నేపధ్యంలో మాజీ మంత్రి బాలినేని నమక్షంలో పార్టీలో చేరటం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈనేపధ్యంలో కూటమి నాయకులు ఆయన సేవలను ఏమాత్రం నద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాల్సి ఉంది . ఇప్పటికే ఆయన అనుచరిడిగా పేరు పొందిన పోశం శ్రీకాంత్ రెడ్డి సైతం జనసేన గూటికి చేరారు.
త్వరలో పలు గ్రామాలలో ఆయన అనుచరులుగా పేరు పడిన వారు, ఆయన బంధువులు పలువురు జనసేన పార్టీలో చేర నున్నట్లు చర్చించుకుంటున్నారు. కూటమి నాయకులు సక్రమంగా వీరిని వినియోగిస్తే ఆయా గ్రామాలలో కూటమి మరింత బలపడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఆయన రాకతో పార్టీ బలోపేతం అవుతుందని జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

