తాళ్లూరు విద్యార్థులను క్రమశిక్షణ ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని మండల విద్యాశాఖాధికారి గురుజాల నుబ్బయ్య అన్నారు. తాళ్లూరు మండలం శనివారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంఆర్ సి కేంద్రంలో ఎంఈఓ సుబ్బయ్య, ఎంఈఓ-2 సుధాకర రావు, ఎంఆర్సీ సిబ్బంది సర్వేపల్లి రాధాక్రిష్ణ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎబీసీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర రావు అధ్యక్షతన గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ నుబ్బయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సర్వేపల్లి రాధా క్రిష్ణ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన జీవిత చరిత్రను వివరించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని లక్ష్య సాధనకు కృషి చెయ్యాలని, పేదరికాన్ని సైతం విద్య ద్వారా జయించవచ్చని చెప్పారు. అనంతరం ఎంఈఓను, కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి , ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర రావు , డైరెక్టర్ కాలేష బాబు ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా నన్మానించారు. మండలంలోని పలు ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.





