దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించటంలో తన దైన రీతిలో స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడుకి తాళ్లూరు ఎపీటీఎఫ్ శాఖ ధన్యవాదాలు చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేసారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు చెప్పారు. ధన్యవాదాలు చెప్పిన వారిలో ఎపీటీఎఫ్ మండల శాఖ గౌరవ అధ్యక్షుడు సంగు రవి చంద్రా రెడ్డి, అధ్యక్షుడు గుండూరు నాగ రాజు, ప్రధాన కార్యదర్శి నారిపెద్ది శ్రీనివాస రావు, జిల్లా కౌల్సిలర్ పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, షేక్ ఖాజా వలి, పోకూరి శ్రీదేవి మండల కమిటీ పాల్గొన్నారు.
