బేగంపేట సెప్టెంబర్ 8,
(జే ఎస్ డి ఎం న్యూస్)
పాస్ పోర్ట్ కార్యాలయం రోడ్డంతా కార్ల పార్కింగ్ చేస్తుండటం తో స్థానికులు ఇలా ఉంటే మేము
పోయేదెలా వచ్చేదెలా అంటూ వాపోతున్నారు.పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్ళే రోడ్డంతా ఉదయం గం 10ల నుంచి సాయంత్రం గం 5వరకు పాస్ పోర్ట్ కార్యాలయానికి వచ్చిన వారు రోడ్డుకు రెండు వైపులా వాహనాలు (కార్లు)పార్కింగ్ చేస్తున్నారు.దీంతో ఆ గల్లీ లో నివాసం ఉండేవారు తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ వాపోతున్నారు.కేవలం సెలవు రోజులు మినహా మిగిలిన అన్ని రోజులు ఇదే పరిస్థితి తో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆరోపిస్తున్నారు.ట్రాఫిక్,పోలీస్ అధికారులు ఈ సమస్యను సీరియస్ గా తీసుకుని రోడ్డు పై అక్రమ పార్కింగ్ ను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

