బేగంపేట సెప్టెంబర్ 12,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాంగోపాల్ పేట డివిజన్ లోని హైదర్ బస్తీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొయినోద్దీన్ ను
మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. మొయినోద్దీన్ కు ఇటీవల గుండె చికిత్స జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం వారి ఇంటికి వెళ్ళి
పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సలహాలు, సూచనను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు జనార్దన్, నాయకులు అభిషేక్, విఠల్, సత్యనారాయణ, చందు, బేగ్, రాములు, నర్సింగ్ రావు తదితరులు ఉన్నారు.

