ఒంగోలు: సెప్టెంబర్ 12,ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో 11 ఏళ్ల విద్యార్థి షేక్ తౌషిక్ అనుమానాస్పద మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏడు నెలలుగా న్యాయం కోసం పోరాడిన తల్లి మౌలాబీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము సుజన్ మాదిగ తీవ్రంగా స్పందించారు. శనివారం ఒంగోలులోని ఎం ఎస్ పి.ఎస్ రాష్ట్ర కార్యాలయంలోఆయన మాట్లాడుతూ ఏడు నెలలుగా ఒక నిరుపేద ముస్లిం తల్లి తనకొడుకు చావుకు న్యాయం చేయమని జిల్లా కలెక్టరేట్ ,పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతుంటే ప్రభుత్వానికి కనిపించలేదా15 రోజులుగా అనుమతులు లేని స్కూల్ ముందు దీక్ష చేస్తుంటే అధికారులు ఎందుకు స్పందించలేదనీ సుజన్ ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, పోలీసుల అలసత్వమే మౌలాభి మృతికి కారణం అని ఒక ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థ కోసం ఒకనిరుపేద ముస్లిం కుటుంబాన్ని బలి చేశారన్నారు.తౌషిక్ మృతి హత్యాలేక ఆత్మహత్యా అనే దానిపై సమగ్ర విచారణ జరపకుండానే డీఎస్పీ స్థాయి అధికారి ఆత్మహత్య అని తేల్చేయడం వెనుక ప్రముఖుల ఒత్తిడి ఉందని ఆరోపణలు వస్తున్నాయని, వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.తౌషిక్ మరియు మౌలాబీ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అనుమతులు లేకుండా నడుస్తున్న సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ ను వెంటనే సీజ్ చేసి యాజమాన్యంపై హత్యా కేసు నమోదు చేయాలి సుజన్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా మరియు ఆకుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి న్యాయం జరిగే వరకు ఎం.ఎస్ పి ఎస్ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి ఎస్ నాయకులు గద్దె త్యాగరాజు, కొలకలూరి విజయ్ కుమార్, కొలకలూరి బాలాజీ రావు, బండారు యేసోబు తదితరులు పాల్గొన్నారు.
