బేగంపేట సెప్టెంబర్ 12,(జే ఎస్ డి ఎం న్యూస్) :
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని,వారి ఎమ్మెల్సీ పదవిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బేగంపేట సీఐని బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ శనివారం కలిసి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధమైన శాసన సభ జరుగుతున్న సమయంలో స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బేగంపేట సీఐ పి.సైదులును కలిసిన ముప్పిడి గోపాల్ లిఖిత పూర్వక పిర్యాదు అందజేశారు.పిర్యాదు చేసిన వారిలో శాంసన్ రాజు. పోడేటి రాజు, శ్రీనివాస్ సాగర్, సలీమ్, తౌఫీక్, శేఖర్ తదితరులు ఉన్నారు.
