క్యాబ్ డ్రైవర్‌ దారుణ హత్య -బేగంపేట లో మిస్సింగ్.పటాన్ చెరు ప్రాంతంలో అనుమానాస్పద మృతి.

బేగంపేట సెప్టెంబర్ 12,(జే ఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధి లో మిస్సింగ్ అయిన ఓ క్యాబ్ డ్రైవర్ అనుమానాస్పద రీతిలో పటాన్ చెరు ప్రాంతంలో శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటనపై మృతిని సోదరి రజిత పిర్యాదు మేరకు బేగంపేట పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది.ఇన్స్పెక్టర్ పి .సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఖమ్మం జిల్లా పాతర్లపాడుకు చెందిన రాజశేఖర్ గత 25 ఏళ్లుగా సీబీఎన్ నగర్‌లో నివాసముంటూ స్విఫ్ట్ క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య లీల (28), ఇద్దరు కుమార్తెలు (6, 4 ఏళ్లు) ఉన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 11న తెల్లవారుజామున 2:30 గంటలకు మారేడ్‌పల్లిలో చివరి ప్యాసింజర్‌ను దింపిన రాజశేఖర్, ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. ఉదయం 4:30 గంటల సమయంలో అతని మొబైల్, వాహనం చివరగా సంగారెడ్డి ఆర్టీసీ కాలనీ సమీపంలో లొకేషన్ చూపించగా, ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్‌ అయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు తొలుత మిస్సింగ్ కేసుగా (క్రైమ్ నెం. 629/2026) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, ముంబై జాతీయ రహదారిపై పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో సంగారెడ్డి సమీపంలో రాజశేఖర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెంది పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసును హత్యగా మార్చి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, మృతదేహం లభించిన ప్రదేశానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో, కోహీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంకోల్-బుధేరా టోల్ గేట్ దాటిన తర్వాత రాజశేఖర్ స్విఫ్ట్ కారును వదిలేసి వెళ్లినట్లు గుర్తించారు. కారుపైనే తాళాలు పెట్టి ఉండటం, పరిసరాల్లో ఖాళీ బీరు సీసాలు పడి ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుండగా, పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తును వేగవంతం చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలియ జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *