సికింద్రాబాద్ మహంకాళి బీజేపీ మోర్చా ప్రభారీల నియామకం.

హైదరాబాద్ సెప్టెంబర్ 12,(జే ఎస్ డి ఎం న్యూస్) :
భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా పరిధిలోని వివిధ మోర్చాలకు నూతన ప్రభారీలను (ఇన్‌ఛార్జ్‌లను) నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయా మోర్చాల జిల్లా అధ్యక్షులకుసమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు వీలుగా జిల్లా స్థాయి పదాధికారులకు ఈ బాధ్యతలనుఅప్పగించినట్లు ఆయన తెలిపారు.ఈ నియామకాల్లో భాగంగా యువమోర్చా ప్రభారీగా జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ (నందు), మహిళా మోర్చా ప్రభారీగా జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపేట రమేష్ రామ్, ఓబీసీ మోర్చా ప్రభారీగా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా జిల్లా ఉపాధ్యక్షుడు కాసాని శ్రీశైలం గౌడ్, ఎస్టీ మోర్చా ప్రభారీగా జిల్లాఉపాధ్యక్షుడు కందాడి నాగేశ్వర్ రెడ్డి, మైనార్టీ మోర్చా
బాధ్యతలను జిల్లా ఉపాధ్యక్షుడు కనకట్ల హరి అరవింద్
పర్యవేక్షించనున్నారు. అలాగే కిసాన్ మోర్చా ప్రభారీగా జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గౌడ్‌ను నియమించారు. నియమితులైన నాయకులు పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూప్రజాసమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని జిల్లా నాయకత్వంపిలుపునిచ్చింది. ఈ నియామక పత్రాల ప్రతులను పార్టీ సీనియర్ నేతలు జి. కిషన్ రెడ్డి, డా. కె. లక్ష్మణ్, ఎన్.రామచందర్ రావు తదితరులకు పంపినట్లు పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *