ఒంగోలు (సెప్టెంబర్ 12)తల్లి, కొడుకు మృతికి కారకులైన సింగరాయకొండ నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలి.తన బిడ్డ తౌశిక్ వృత్తికి కారకులైన సదరు విద్యా సంస్థ చైర్మన్, అతని కొడుకు ప చర్యలు తీసుకోవాలని గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్న కౌశిక్ తల్లి మౌలాభి నీ ప్రభుత్వం పట్టించుకోవడం పోవడంతో నిరాశ, నిస్ప్రోలకు గురై న్యాయం జరగదని మనోవేదన తో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, వెంటనే సింగరాయకొండ నవోదయ యాజమాన్యాన్ని అరెస్టు చేసి జైలుకు పంపాలనీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు సైదా అన్నారు.
ఒక ముస్లిం మైనార్టీ కుటుంబానికి అన్యాయం జరిగితే! రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గాని, రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గాని స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాజకీయ అండతో నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారు. రాజకీయ, అర్థ ,అంగ బలంతో ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు స్కూల్ యాజమాన్యం బరితెగించి ప్రవర్తిస్తుంది. స్కూల్ కి ఎలాంటి అనుమతులు లేకపోయినా స్కూల్ నడుస్తుందంటే! అధికారులు ఎంత అలసత్వంగా వ్యవహరిస్తున్నారో అర్థం అవుతుందనీ సైదా అన్నారు.
బిడ్డ చనిపోయినప్పుడే చర్యలు తీసుకొని ఉంటే! తల్లి ఆత్మార్పునకు అవకాశం ఉండేది కాదు. ఈ రెండు చావులు ప్రభుత్వం చేసిన హత్యలే! స్వయాన రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి సొంత నియోజకవర్గంలో ఇలాంటి దుర్ఘటన జరిగితే మంత్రి పట్టించుకోకాపోవడం. బాధ్యతారాహిత్యం, దీని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అధికార పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యే సైతం తమకు ఓట్లు వేసి గెలిపించిన ఈ పేద ముస్లిం మైనార్టీ కుటుంబానికి అండగా నిలవకపోవడంసహేతుకం కాదు, ఇది నీతిమాలిన చర్య.కులం బలం ముందు ముస్లిం మైనార్టీ కుటుంబం ఓడిపోయిందనీ సైదా ఆవేదన వ్యక్తం చేశారు.
