15 రోజులుగా మంచినీరు ఇవ్వకపోతేఎలా బ్రతకాలి?? -సాయినగర్ ప్రజలు అవేధన- రాస్తారోకో

దరిశి మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్ కి గత 15 రోజుల నుంచి త్రాగడానికి NAP మంచినీరు ఇవ్వడం లేదని ఈరోజు ఉదయం దరిశి – వినుకొండ రోడ్డుపై రెండు గంటల సేపు రాస్తారోకో జరగగా ట్రాఫిక్ భారిగా ఆగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపియం దరిశి నియోజక వర్గ కార్యదర్శి తాండవ రంగారావు మాట్లాడుతూ ఎన్.ఏ.పి స్కీం పక్కన ఉన్న గ్రామం సాయినగర్ కి 15 రోజుల నుంచి మంచినీరు ఇవ్వకపోవడం అన్యాయమని మోటరు బాగుచేయడానికి ఎన్నిరోజులు అధికారులకు కావాలని ప్రశ్నించారు. ఈప్రాంత ప్రజలు అందరూ రోజువారి పనులు చేసుకుని జీవనం సాగించే కూలీలని రోజు పనికి పోతే తిండితినే ప్రజలకు మంచినీరు ఇవ్వకపోవడంతో ట్యాంకర్ ద్వారా రమ్ము నీరు 60 రూపాయల నుంచి 100 రూపాయలకు కొనుగోను చేసి బ్రతుకుతున్నారని NAP అధికారులు , ప్రజా ప్రతినిధులు , ప్రభుత్వం పేద ప్రజలకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారా అని అన్నారు. అనేక సార్లు NAP అధికారులను మంచినీరు ఇవ్వాలని అడుగగా మోటర్ రిపేరు వచ్చిందని డబ్బులు లేవని మీ దిక్కు ఉన్న చోట చెప్పుకోవాలని నోటికి వచ్చినట్లు మాట్లాడు చున్నారని మహిళలు ఆవేధన వ్యక్తం చేశారు. ఆందోళన కారుల వద్దకు మున్సిఫల్ కమీషనర్ , సబ్ ఇన్సుసెక్టర్ వచ్చిన వారిని రంగారావు నిలదీశారు. తక్షణం ట్రాక్టర్స్ ద్వారా నీరు తొలుతామని , రేపు ఆదివారం లోగా మోటర్ బాగుచేసి ట్యాంకులకు నీరు నింపి కుళాయిలకు ఇస్తామని మంచినీటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించడం జరిగింది. ఈ ఆందోళనలో స్థానిక ప్రజలు పోట్లూరి పుల్లయ్య, నారాయణమ్మ , లక్ష్మీ, సుంకు నారాయణ , కొమరగిరి కోటేశ్వరరావు , గజ్జల బాలు , బాలమ్మ , సువర్ణ రాజు , భూలక్ష్మీ , వెంకటేశ్వర్లు , రాజ్యం తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *