బేగంపేట సెప్టెంబర్ 15,(జే ఎస్ డి ఎం న్యూస్)
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని,మహంకాళి జిల్లా బి జె పి ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్. అన్నారు.బీజేపీ బేగంపేట్ డివిజన్ అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో, మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి నేమలి ఆనంద్ (నందు) నేతృత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగానిర్వహించాలని కోరుతూ సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్ కి వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ ప్రజలు
నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన చారిత్రాత్మక సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో ఈ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సి. విజయ్ కుమార్, డివిజన్ జనరల్ సెక్రటరీ బాబు రావు పాల్గొన్నారు.
