తాళ్లూరు: మండలంలో సెప్టెంబర్ నెలలో పడిన వర్షానికి నేల పదునైనందున తగిన పంటలను సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. మండలంలో సెప్టెంబర్ నెలలో 124.4 మి.మీల వర్షపాతం నమోదు అయినట్లు ఎవో తెలిపారు. కెవీ పాలెం, తాళ్లూరులలో శనివారం క్షేత్ర పర్యటన చేసారు. ఈ సందర్భంగా ఎవో మాట్లాడుతూ తక్కువ వర్షపాతం తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలని కోరారు. కందిలో పీ ఆరోజో 158, టిఆర్టీ – 22, కో ఆర్డీ -7, మినుము, ఉలవలో రకాలను సాగు చెయ్యాలని కోరారు. ఎఈఓ సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
