గణేష్ నవరాత్రులు అంటే హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట సెప్టెంబర్ 19,(జే ఎస్ డి ఎం న్యూస్) :
గణేష్ నవరాత్రులు అంటే హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రాంగోపాల్ పేట డివిజన్ రాణి గంజ్ లో మినీ గూడ్స్ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణ నాధుడిని ఆయన దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, కొండాపురం మహేష్ యాదవ్, చంద్ర ప్రకాష్, అరుణ్ భట్, రాంమోహన్ యాదవ్, అసోసియేషన్ ప్రతినిధి తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *