పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత -​ తూర్పు నాయుడు పాలెం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి-​ కొండపి నియోజకవర్గంలో 359 మంది లబ్ధిదారులకు ₹1.90 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీల పంపిణీ – ​ ఇప్పటి వరకు నియోజకవర్గంలో 2,560 మందికి ₹19.98 కోట్ల ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం – ​ P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు కృషి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో ​ఆదివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల. వీరాంజనేయస్వామి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులు మరియు ఎల్‌ఓసీ (LOC)ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయపత్రాలను స్వయంగా అందించి, వారి ఆరోగ్య స్థితిగతులను, క్షేమ సమాచారాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
​ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా బాల. వీరాంజనేయస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అత్యుత్తమ వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలకు భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ నిరుపేద కుటుంబం కూడా వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున సీఎంఆర్‌ఎఫ్ నిధులను మంజూరు చేస్తోందని కొనియాడారు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరిన బాధితులకు తక్షణ అత్యవసర చికిత్సల కోసం ఎల్‌ఓసీలు (Letter of Credit) జారీ చేస్తూ, శస్త్రచికిత్సల అనంతరం ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల రూపంలో నిధులు అందజేస్తూ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటోందని ఆయన చెప్పారు.
​ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక ‘సంజీవని’ ప్రాజెక్ట్ గురించి మంత్రి ఈ సందర్భంగా సమగ్రంగా వివరించారు. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికి ఆభా (ABHA) డిజిటల్ హెల్త్ ఐడీలను కేటాయించి, వారి సమగ్ర వైద్య సమాచారాన్ని భద్రపరచడం ద్వారా ముందస్తు రోగ నిర్ధారణ (Predictive), నివారణ (Preventive) మరియు నాణ్యమైన చికిత్స (Curative) సేవలను అందిస్తున్నామని తెలిపారు. సంజీవని వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఇంటి వద్దకే ఉచిత ల్యాబ్ పరీక్షలు, ఇ-ఔషధి ద్వారా నాణ్యమైన మందుల పంపిణీ, స్పెషలిస్ట్ వైద్యుల టెలి-కన్సల్టేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. దీనికితోడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, ఉచితంగా మందుల సరఫరా మరియు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకం ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఉచిత శస్త్రచికిత్సలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
ఈ విడత సీఎంఆర్‌ఎఫ్ సాయంలో భాగంగా కొండపి నియోజకవర్గానికి గత సెప్టెంబర్ 17వ తేదీన రూ. 1,90,03,488 (కోటి తొంబై లక్షల మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు) మంజూరయ్యాయని మంత్రి వెల్లడించారు. దీనిద్వారా మొత్తం 359 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరిందని, అందులో అత్యవసర వైద్యం కోసం 21 మందికి ఎల్‌ఓసీలు, అలాగే 338 మంది బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.  

​అంతేకాకుండా, కొండపి నియోజకవర్గ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో మొత్తం 2,560 మంది నిరుపేద బాధితులకు రూ. 19,98,25,003 (పంతొమ్మిది కోట్ల తొంబై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల మూడు రూపాయలు) విలువైన ఉచిత వైద్య సహాయాన్ని అందించామని మంత్రి వివరాలు వెల్లడించారు. ఇందులో 324 మందికి ఎల్‌ఓసీల ద్వారా ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో తక్షణ చికిత్స అందించగా, 2,236 మందికి చెక్కుల రూపంలో ఆర్థిక సాయం
అందించామని తెలియజేశారు.
​రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ‘P4’ (పబ్లిక్ – ప్రైవేట్ – పీపుల్ పార్టనర్‌షిప్) నమూనాను అమల్లోకి తీసుకొచ్చారని మంత్రి బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా, ప్రజల శ్రేయస్సు కోసం చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో పూర్తిగా నిర్వీర్యమై, అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేడు అభివృద్ధి, సంక్షేమ రంగాలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వేగంగా పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, వివిధ , మండల అధికారులతో పాటు పెద్ద ఎత్తున లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *