దర్శిలోని స్థానిక పీజీయన్ కాంప్లెక్ష్ లో ఆదివారం మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కార్యాలయంలో సంస్థ ప్రతినిధులతో సమీక్షాసమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థయొక్క అజెండాలోని ప్రధాన అంశాలను చర్చించడం జరిగింది. అనంతరం, నూతనంగా ‘సెంట్రల్ కన్వీనర్’ గా నియమించబడిన దర్శి పట్టణ ప్రముఖులు కపురం శ్రీనివాసరెడ్డి, జిల్లా జాయింట్ సెక్రటరీ గా ఎంపికైన జి.వేణు లను దర్శి మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులు దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాదు, అధ్యక్షుడు ధనిరెడ్డి వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ వాకా జనార్ధన్ రెడ్డి, కన్వీనర్ చీదెళ్ళ బసవయ్య, కోశాధికారి చింతా తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ రోశారావు, డైరెక్టర్లు బ్రహ్మారెడ్డి, నారాయణ, చీదెళ్ళ ప్రసాద్, పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

