పోలింగ్ సామగ్రి నిర్వహణ, కౌంటింగ్ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి శనివారం ఆయన ఒంగోలు నగర శివారులో ఉన్న రైజ్ ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రం కూడా ఈ కాలేజీ ప్రాంగణంలోనే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ దృష్ట్యా ఆయా పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికలకు అవసరమైన మొత్తం 101 స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ సామగ్రిని నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లోని 224 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఈ సామగ్రిని ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా శనివారం సాయంత్రానికే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన బారికేడ్ల ఏర్పాటు, బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేసిన తీరును కూడా ఆయన పరిశీలించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా, ఈ దిశగా చేస్తున్న పనుల పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: