బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్ కి బంగ్లాదేశ్ ‘ ఆర్నబ్ ‘ అని పేరు పెట్టింది. దీని అర్థం ‘ సముద్రం ‘. నిన్న ఏర్పడ్డ అల్పపీడనం నేడు వాయుగుండంగా, రేపటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని IMD తెలిపింది. 26 కల్లా తుఫాన్‌గా మారుతుందని, 28న కళింగపట్నం-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని అంచనా వేసింది. దీంతో 26 నుంచి మూడు రోజుల పాటు శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Save or share this story as a newspaper-style Epaper Clip: