తాళ్లూరు: మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జిల్లా లీగల్ కమ్ ప్రొబిషన్ అధికారి బి రత్న ప్రసాద్ అన్నారు. దళిత రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో దారం వారి పాలెం పాముల కాలనీలో సోమవారం మత్తు పదార్ధాలు, దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. దళిత రిసోర్స్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మత్తు పదార్ధాలు అలవాటు పడటం వలన యువత తమ విద్య, ఉపాధి అవకాశాలను కోల్పోతారని చెప్పారు. మత్తు పదార్ధాలకు నో చెప్పాలి ఆరోగ్య భవిష్యత్‌కు బాటలు వెయ్యాలి అనే సందేశంతో యువత విస్తృ తంగా తీసుకువెళ్లాలని కోరారు. జిల్లా యువ సాత్వి కోఆర్డినేటర్ ఎన్ సిద్దిక్ మాట్లాడుతూ తల్లిదండ్రుల తమ పిల్లల ప్రవర్తనతో గమనించాలని కోరారు. పాఠశాలలు, కళాశాలలో అవగాహన కల్పించాలని చెప్పారు. మాదక ద్రవ్యాలు వినియోగం లేదా అక్రమ విక్రయాల గురించి సమాచారం తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించి మత్తు సమాజ రహిత నిర్మాణానికి సహకరించాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: