తాళ్లూరు: ఎట్టకేలకు తాళ్లూరు మండల ప్రజా పరిషత్ మొదటి సారిగా 40 సంవత్సరాల తర్వాత టిడిపి కైవసం చేసుకున్నది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 14 ప్రదేశికాలకు గాను 14 మంది టిడిపి బలపరచిన అభ్యర్థులు మాత్రమే మిగలటంతో వారికి ఆర్ ఓ దేవనహాయం, ఎఆర్ ఓ లు ఎంపీడీఓ అజిత, తహసీల్దార్ రమణా రావులు డిక్లరేషన్ ఫారాలు అందించారు. దీంతో టిడిపి శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డిక్లరేషన్ ఫారాలు అందుకున్న ఎంపీటీసీలు దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లను కలిసేందుకు దర్శి తరలివెళ్లారు. ఎకగ్రీవంగా టిడిపి పార్టీ బలపరచి ఎంపిక అయిన ఎంపీటీసీలలో శివరామపురం బొమ్మిరెడ్డి రమణమ్మ, దోనకాయల పాడు ఎంపీటీసీగా కృష్ణం నాగేశ్వర రావు, బొద్దికూరపాడు దేవండ్ల లక్ష్మి, తూర్పుగంగవరం -1 యాడిక శ్రీకాంత్ రెడ్డి, తూర్పుగంగవరం 2 బొల్లా నరేంద్ర పెద బాబు, లక్కవరం వల్లెపు వెంకట సుబ్బా రావు, మాధవరం పాలెపోగు రవి, మల్కాపురం అనపర్తి సంతోషం, మన్నేపల్లి గోళ్ల పాటి మేషేక్, నాగంబొట్ల పాలెం వేడికోల చంద్రమ్మ, తాళ్లూరు – 1 కోట వెంకట లక్ష్మి, తాళ్లూరు-2 కాడ్రేడ్డి విజయ, తురక పాలెం అన్నపు రెడ్డి రమణ, వెలుగు వారి పాలెం అలూరి అక్కమ్మలు ఉన్నారు. వారికి టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక రంగ అకాడమీ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, నాయకులు మానం రమేష్, జెడ్పీటీసీ అభ్యర్థి కైపు రామకోటి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఐ వెంకటేశ్వర రెడ్డి, నవులూరి విద్యాసాగర్, గొల్లపూడి వేణుబాబు, ఎంఎంసీ డైరెక్టర్లు హనుమా రెడ్డి, ఖాసిం సైదా, క్టన్లర్ ఇన్చార్జి లు రాచకొండ వెంకట రావు, కైపు నాగార్జున రెడ్డి, నారిపెద్ది కళ్యాణ్ చందన, గురువా రెడ్డి, తిరుపతి స్వామి, పి రమణా రెడ్డి , తిరుపతి రెడ్డి పలు గ్రామాల నాయకులు అభినందనలు తెలిపారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: