తాళ్లూరు: ప్రజలకు నకాలంలో సేవలు అందించాలని తహసీల్దార్ రమణా రావు కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో మంగళ వారం విఆరీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పలువురు విరిలు సిబ్బంది బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఫైల్లు పెండింగ్లో లేకుండా నక్రమంగా అయ్యే పని అయితే తక్షణమే చెప్పాలని లేదంటే వారిని కార్యాలయాలు చుట్టూ తిప్పవద్దని కోరారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ లు గోపాలుని ఫణీంధ్ర, ప్రశాంత్, ఎన్ఏ శ్రీనివాస రావు, ఆర నుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: