తాళ్లూరు: మండల విద్యాశాఖాధికారి కార్యాలయం కాంప్లెక్స్‌లో ఉన్న వెంకట రెడ్డి పాలెం ప్రాధమిక పాఠశాల గేటు వద్ద మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా 11కెవీ విద్యుత్ తీగ తెగిపడినది. అదే సమయంలో పాఠశాల విడుచు సమయం కావటంతో విద్యార్థులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఒక్కసారిగా తీగ తెగటంతో గేటు అంచులు క్రింద పడకుండా అడ్డుకున్నాయి. దీంతో అదే గేటులో తీగ క్రింద గుండా ఒక విద్యార్థి బయటకు పరుగు పెట్టటం ఉపాధ్యాయులు పెద్ది రెడ్డి, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది మహేష్ గమనించి కేకలు వేసారు. అదే దారిలో వెళ్లున్న లైన్మెన్ ప్రాంక్లిన్ను పిలిచి విషయం చెప్పారు. దీంతో తక్షణమే లైన్ మెన్ ఎఈ రామక్రిష్ణా రెడ్డికి విషయం తెలిపి విద్యుత్‌ను ఆపివేసి మరమ్మత్తులు చేసారు. పెను ప్రమాదం తప్పటంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: