గుడ్లూరు చెరువు చెక్ పోస్ట్ వద్ద ఎస్.ఎస్.టి (SST) తనిఖీలను ఆకస్మికంగా పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి

స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేసే క్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, గుడ్లూరు తహసీల్దార్‌తో కలిసి గుడ్లూరు సరిహద్దుల్లోని చెరువు చెక్ పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ (SST) తనిఖీలను గురువారం ఆకస్మికంగా పరిశీలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
​ఈ సందర్బంగా చెక్ పోస్ట్ వద్ద జరుగుతున్న వాహనాల తనిఖీ సరళిని, రిజిస్టర్లలో వివరాల నమోదు విధానాన్ని జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం తనిఖీ బృందం సభ్యులు మరియు స్థానిక అధికారులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్, ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. సరిహద్దు ప్రాంతాల గుండా ఓటర్లను ప్రభావితం చేసేందుకు తరలించే ఎలాంటి అక్రమ నగదు, మద్యం, ఉచిత బహుమతులు లేదా ఇతర నిషేధిత వస్తువులు జిల్లాలోకి ప్రవేశించకుండా 24 గంటలూ డేగకన్ను ఉంచాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.

​రవాణా అవుతున్న నగదుకు సంబంధించి సక్రమమైన ఆధారాలు లేకపోతే వెంటనే సీజ్ చేసి, విధివిధానాల ప్రకారం ఉన్నతాధికారులకు నివేదించాలని వెల్లడించారు. అలాగే తనిఖీల సమయంలో ప్రయాణికులకు లేదా అత్యవసర సేవలకు ఎలాంటి అనవసర ఆటంకాలు కలగకుండా, సిబ్బంది అత్యంత బాధ్యతాయుతంగా మరియు సౌమ్యంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

చెక్ పోస్ట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని, ప్రతి వాహన వివరాలను క్షణాల్లో నమోదు చేసేలా రికార్డులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడాలని చూస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఉచిత, న్యాయబద్ధమైన ఎన్నికల నిర్వహణకు ప్రజలు మరియు అధికారులు సహకరించాలని కోరారు.

ఈ తనిఖీ లో బాగంగా జాయింట్ కలెక్టర్ వెంట గుడ్లూరు తహసీల్దార్ రవి, ఎస్.ఎస్.టి బృందం సభ్యులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *