బాల్య వివాహరహిత సమాజ ఆవిష్కరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వక్తలు అన్నారు . అంతర్జాతీయ బాల్య వివాహాల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా కస్తూరిభాగాంధీ గురుకుల బాలికల విద్యాలయంలో ప్రిన్సిపల్ ఎస్ పద్మావతి అ ద్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా చందలూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ యాతం సురేఖ, ప్రముఖ న్యాయవాది గడ్డి శ్రీనివాసులు, ప్రముఖ సంఘ సేవకులు, ఐ ఆర్ సి ఎస్ జిల్లా ప్రతినిధి , మానవత స్వచ్చంద సేవా సంస్థ సెంట్రల్ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి లు పాల్గొన్నారు . బాల్యవివాహాలు, వాటి ద్వారా ఉత్పన్నమవుతున్న దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు కపురం శ్రీనివాసరెడ్డి వివరించారు. బాల్య వివాహాలవల్ల నిజానికి జీవితంలో ఎంత నష్టం జరుగుతుందో అన్నీ విషయాలు సవివరంగా ప్రభుత్వ డాక్టర్ సురేఖ విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా బాల్య వివాహ చట్టం గురించి లాయర్ గడ్డి శ్రీనివాసులు సవివరంగా వివరించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: