దర్శి : దర్శి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు.వినుకొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో, దర్శి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా బాధ్యతలు చేపట్టిన జీవీ ఆంజనేయులుకు వారు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు మరియు రాబోయే ఎన్నికల వ్యూహాలపై నేతలు చర్చించారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: