ఒంగోలు : ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయ సమితి (NVS) ఆధ్వర్యంలో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించిన జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ (JNVST) నేడు ప్రశాంత వాతావరణంలో ముగిసిందని విద్యాలయ ప్రిన్సిపాల్ సి. శివరాం తెలిపారు. నేడు పరీక్ష ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
ఈ పరీక్షకు జిల్లా నుండి వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
పరీక్ష కి అప్లై చేసిన వారి సంఖ్య – 5943
పరీక్ష కు హాజరైన అభ్యర్థులు –
- 4692
పరీక్ష కు హాజరుకాని అభ్యర్థులు సంఖ్య – 1251
మొత్తం – 78.95% హాజరు అయినారు.
పరీక్ష సజావుగా జరిగేందుకు సహకరించిన అధికారులకు, ఉపాధ్యాయులకు, పోలీస్ సిబ్బందికి, తల్లిదండ్రులకు నిర్వాహకులు అందరికి ప్రిన్సిపాల్ సి. శివరాం కృతజ్ఞతలు తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: